సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (12:59 IST)

గ‌న్న‌వ‌రం నుంచి స్పైస్ జెట్ ర‌ద్దు! 70% ఖాళీ సీట్లు!!

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానాలు రద్దు అయ్యాయి. కోవిడ్ కార‌ణంగా క‌నీసం 30% కూడా నిండని సీట్ల‌తో తాము స‌ర్వీస్ ఎలా న‌డుపుతామ‌ని విమాన సంస్థ‌ల వారు ప్ర‌శ్నిస్తున్నారు.

ప్రయాణికుల బుకింగ్ లు లేవు... ఇలాగైతే విమాన సర్వీసులు నడపలేమని స్పైస్ జెట్ యాజమాన్యం తెలిపింది. ఆన్లైన్ బుకింగ్ లను స్పైస్ జెట్ సంస్థ నిలిపివేసింది. రెండు నెలల పాటు విమానాలు తిప్పలేమని స్పైస్ జెట్ సంస్థ స్ప‌ష్టం చేసింది. రెండు నెలల తరువాత గన్నవరం విమానాశ్రయంలో సర్వీసులు నడిపేది, లేనిది నవంబర్ లో ప్రకటిస్తామని తెలిపింది.

బెంగుళూరు, హైదరాబాద్, చెన్నై, విశాఖపట్నం ప్రాంతాలకు నడిపే స్పైస్ జెట్ విమానాలు రద్దవడంతో ఒక్కసారిగా గన్నవరం విమానాశ్రయం ఖాళీ అయిపోయింది. గత ప్రభుత్వం హ‌యాంలో స్పైస్ జెట్ ఫ్లైట్ ల్లో 80%పైగా ఉన్న బుకింగ్ లు, ఇపుడు క‌రోనా కార‌ణంగా ఒక్కసారిగా 30% నికి బుకింగ్ లు త‌గ్గిపోయాయి. ఇపుడు గన్నవరం విమానాశ్రయంలో రన్ వే సౌక‌ర్యాలు పెరిగాయి కానీ, విమాన స‌ర్వీసులు మాత్రం పూర్తిగా తగ్గిపోయాయి.