మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : బుధవారం, 10 జనవరి 2018 (11:25 IST)

హైదరాబాదులో యువతి దారుణ హత్య: ప్రేమోన్మాదే చంపేశాడా?

హైదరాబాదులో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఓ యువతిని పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో వేధించిన అతడు కత్తులతో పొడిచి.. దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్థరాత్రి యువతి దారుణంగా హత్యకు గుర

హైదరాబాదులో ప్రేమ పేరుతో ఓ ఉన్మాది ఓ యువతిని పొట్టనబెట్టుకున్నాడు. ప్రేమ పేరుతో వేధించిన అతడు కత్తులతో పొడిచి.. దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం అర్థరాత్రి యువతి దారుణంగా హత్యకు గురైందని పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జానకి అనే యువతి మూసాపేట్ హబీబ్ నగర్‌లో ఉంటోంది. 
 
కూకట్ పల్లిలోని డీమార్ట్‌లో పనిచేస్తున్న ఆమెను ఆనంద్ అనే యువకుడు ప్రేమిస్తున్నానని వేధించేవాడు. ప్రేమించకపోతే చంపేస్తానంటూ చాలాసార్లు  బెదిరించాడని జానకి స్నేహితురాళ్లు తెలిపారు. అయితే జానకి హత్యకు గురైంది. ఈ హత్యకు ఆనందే కారణమని వారు అనుమానిస్తున్నారు. 
 
జానకి ఒంటరిగా వున్న సమయంలో ఆమెపై ఈ దారుణం జరిగిందని.. ఉద్యోగానికి వెళ్లొచ్చి చూసేలోపు రక్తపుమడుగులో జానకి కనిపించిందని స్నేహితురాళ్లు చెప్పారు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.