శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 7 జనవరి 2018 (18:25 IST)

కౌన్సిలింగ్‌కు ప్రదీప్.. కారులో వున్న అమ్మాయి ఎవరు? నెట్టింట చర్చ..

కొత్త సంవత్సరంగా సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో యాంకర్ ప్రదీప్ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరుకానున్నారు. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి సమయ

కొత్త సంవత్సరంగా సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో యాంకర్ ప్రదీప్ పోలీసులకు పట్టుబడ్డాడు. సోమవారం బేగంపేట ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌కు ప్రదీప్ హాజరుకానున్నారు. డిసెంబర్‌ 31న అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రదీప్‌ ట్రాఫిక్‌ పోలీసుల కంట పడిన సంగతి తెలిసిందే. 
 
నిబంధనల ప్రకారం తల్లి లేదా భార్యను కౌన్సెలింగ్‌కు తీసుకురావాల్సి ఉంటుంది. పెళ్లి కాలేదు కాబట్టి తల్లిని తీసుకొని రావాలని నిబంధనలను పోలీసులు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా కారు అద్దాలకు బ్లాక్‌ఫిలిం ఏర్పాటు చేసుకున్న ఘటనలోనూ ప్రదీప్‌పై పోలీసులు జరిమానా విధించేందుకు సిద్ధమవుతున్నారు.
 
అయితే ప్రదీప్ డ్రంకన్ డ్రైవ్ ఘటన సందర్భంగా ఆయన కారులో ముగ్గురు ప్రయాణించారు. అందులో ఇద్ద‌రు అమ్మాయిలు. ఒక అబ్బాయి ప్ర‌దీప్ ఉన్నారు. మ‌రి ప‌క్క‌నే ఉన్న ఆ అమ్మాయిలు ఎవ‌రు అని నెటిజ‌న్లు ఒక‌టే చ‌ర్చించుకుంటున్నారు. అయితే వారిలో స‌గం క‌వ‌ర్ అయిన ఫోటోని చూసి  శ్రీముఖి అని కొంద‌రు అంటున్నారు. అయితే ఈ వార్తలను శ్రీముఖి ఖండించింది. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి తెలుగు రాష్ట్రాల్లో మంచి పేరున్న ఓ రాజకీయ నేత కుమార్తెనని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.