ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 29 జులై 2021 (23:41 IST)

నిండు కుండలా శ్రీశైలం.. 2007 తర్వాత 10 గేట్లు ఎత్తివేత (video)

శ్రీశైలం జలాశయం నిండు కుండను తలపిస్తుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జలాశయానికి నీరు అధిక సంఖ్యలో వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో అధికారులు బుధవారం సాయంత్రం క్రమంగా 10 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. 2007 తర్వాత జూలై నెలలో శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి కావడం విశేషం.
 
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 885 అడుగులు (215 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 881.50 అడుగులు (196 టీఎంసీలు)గా ఉంది. ఇన్‌ఫ్లో 4.65 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 
 
ఎగువ తుంగభద్ర, జూరాల, సుంకేశుల నుంచి భారీగా ఇన్‌ఫ్లో వస్తుండటం ఇప్పటికే శ్రీశైలం నిండటంతో ఇక వచ్చిన వరద వచ్చినట్లు నాగార్జున సాగర్‌కు చేరనుంది. శ్రీశైలం రిజర్వాయర్‌లో వరద ప్రవాహం ఇదే రీతిలో కొనసాగితే మరో వారంలో నాగార్జున సాగర్‌ డ్యాం సైతం నిండే అవకాశం ఉంటుంది.