గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 జులై 2022 (13:44 IST)

వైఎస్ కుటుంబ సభ్యులను కూడా చంపేస్తారు.. భద్రత కల్పించండి..

tdplogo
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య వైఎస్.విజయలక్ష్మి, కుమార్తె వైఎస్ షర్మిలకు భద్రత కల్పించాలని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో వైఎస్ వివేకానంద రెడ్డిని హత్యచేసి ఆ నింద తెలుగుదేశం పార్టీపై మోపారని ఆరోపించారు. ఇపుడు మళ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. వైఎస్ కుటుంబంలో ఎవరిని చంపుతారో తెలియట్లేదన్నారు. 
 
అందువల్ల వైఎస్ విజయలక్ష్మి, వైఎస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమార్, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తెలకు జడ్ కేటగిరీ భద్రత కల్పించాలన్నారు. పైగా, రాజశేఖర్ రెడ్డితి హత్య కాదు రిలయన్స్ వాళ్లే చంపించారని అప్పట్లో జగన్ పత్రికలో రాయించుకున్నారని, కానీ అధికారంలోకి వచ్చారు. ముఖేష్ అంబానీ రాజ్యసభ సీటు అడిగ్గానే రాజ్యసభ సీటు ఇచ్చారన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన గుర్తుచేశారు.