1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 సెప్టెంబరు 2023 (15:11 IST)

ఏ క్షణమైనా నన్ను అరెస్టు చేయొచ్చు : చంద్రబాబు నాయుడు

chandrababu naidu
తనను కూడా ఏ క్షణమైనా అరెస్టు చేయొచ్చని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సీఎం జగన్ పాలనలో రాష్ట్రం అరాచక పాలన సాగుతుందని  ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన బుధవారం రాయదుర్గంలో ఉపాధ్యాయులు, న్యాయవాదులు, మేధావులు, విద్యావంతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకురాగా.. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 
 
వైకాపా ప్రభుత్వంలో విధ్వంస పాలన సాగుతుందన్నారు. దీన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. జగన్ ఒక సైకో మాత్రమే కాదు.. కరడుగట్టిన సైకో. రైతులకు కూడా చెప్పకుండా భూముల్లో కాల్వలు తవ్వుతున్నారు. తప్పులను ప్రశ్నిస్తే అడ్డుకునే పరిస్థితి ఉంది. ఇసుక అక్రమాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో కేసులు వేసిన నాగేంద్రను వేధిస్తున్నారు. అనేకంగా రేపో, ఎల్లుండో నన్ను కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది. లేకుండా తనపై దాడి జరగొచ్చు అని అనుమానం వ్యక్తం చేశారు. చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు నిప్పులా బతికానని, తాను ఏ తప్పూ చేయనని చంద్రబాబు స్పష్టం చేశారు.