శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 25 అక్టోబరు 2019 (14:21 IST)

బీజేపీ ఎంపీ సుజనా చౌదరితో కలిసి కారెక్కిన టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ

తెలుగుదేశం పార్టీకి ఆగిఆగి షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు. అదను చూసి పార్టీ నుంచి జంప్ అవుతున్నారు. తెదేపా చీఫ్ చంద్రబాబు నాయుడుకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మరో నాయకుడు భాజపా నాయకుడుతో తాజా భేటీ చర్చనీయాంశంగా మారింది. 
 
ఒంగోలు వెళ్తున్న సుజనా చౌదరిని తెదేపా ఎమ్మెల్యే వంశీమోహన్ కలిశారు. అంతేకాదు ఇద్దరూ కలిసి ఒకే కారులో ఒంగోలు వెళ్లారు. 
 
ఈ రోజు టీడిపి తలపెట్టిన ఇసుక కొరత ఆందోళనకు టీడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ దూరంగా వున్నారు. ఆయనలా దూరంగా వున్నారన్నది ఆసక్తి రేకిస్తుండగా సుజనా చౌదరితో కలిసి కారు ప్రయాణం చేయడం చర్చనీయాంశంగా మారింది.