శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 16 సెప్టెంబరు 2019 (15:23 IST)

ప్రవాహం ఉధృతంగా ఉన్నపుడు పర్యాటక పడవకు అనుమతి ఇచ్చింది ఎవరు?

తూర్పుగోదావరి జిల్లా గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదంపై టీడీపీ స్పందించింది. గోదావరి ప్రవాహం ఉధృతంగా సాగుతున్నపుడు పర్యాటక పడవకు అనుమతి ఇచ్చింది ఎవరు అంటూ నిలదీసింది. ఇదే అంశంపై ఫేస్‌బుక్ ఖాతాల్ ఓ పోస్ట్ చేసింది. 
 
"నెల రోజులుగా గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. దేవీపట్నం సమీపంలో 36 గ్రామాలు దాదాపు 20 రోజులుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. గోదావరిలో వరద ప్రవాహం రెండున్నర లక్షల క్యూసెక్కుల లోపు ఉంటేనే నదిలో బోటు ప్రయాణానికి అనుమతివ్వాలి. కానీ ఆదివారం వరద ఐదు లక్షల క్యూసెక్కులకుపైనే ఉంది. ఆ స్థాయి వరద నీటిలో బోట్ల రాకపోకలు చాలా ప్రమాదకరం. అయినా పర్యాటక పడవకు అనుమతి ఇచ్చింది ఎవరు? 
 
గోదావరిలో బోట్లకు అనుమతి, రద్దు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న కాకినాడ పోర్టు అధికారులు ఏం చేస్తున్నారు? పోర్టు అధికారులకు ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై సమాచారమిచ్చి హెచ్చరికలు చేయాల్సిన రాష్ట్ర నీటిపారుదల శాఖ ఏం చేస్తోంది? అలాగే పాపికొండలుకు బోట్లు బయల్దేరే ముందు దేవీపట్నం నుంచి పోలీసులు వచ్చి తనిఖీ చేసి పంపాలి. ఆదివారం ఆ తనిఖీలు జరిగాయా లేదా? జరిగితే బోటు ఎలా బయలుదేరింది? 
 
అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటున్నారు ప్రజలు. వైసీపీ ప్రభుత్వం ప్రతి అవినీతినీ చూసీ చూడనట్టుగా వదిలేయడంవల్లే ఈరోజు పదుల సంఖ్యలో కుటుంబాలు తమ ఆప్తులను పోగొట్టుకోవాల్సి వచ్చింది అంటూ తెదేపా ఆ ట్వీట్‌లో పేర్కొంది.