శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 26 డిశెంబరు 2018 (20:35 IST)

తోటి ఉద్యోగినితో కాపురం పెట్టాడు.. భార్యకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు..

ఆధునికత పెరిగే కొద్దీ స్మార్ట్ ఫోన్ల వాడకం ప్రభావంతో మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. ఈ క్రమంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు పెరిగిపోతున్నాయి.


పాశ్చాత్య పోకడలు, ఐటీ ఉద్యోగం వుందనే ధీమాతో ఓ టెక్కీ భార్యను పక్కనబెట్టాడు. తోటి ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కానీ భార్య ఈ విషయాన్ని తెలుసుకుని భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... నల్గొండ జిల్లాకు చెందిన నాగరాజుకు, అమూల్యతో 2007లో వివాహం జరిగింది. వీరికి ఓ పాప వుంది. అయితే టీసీఎస్‌లో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న నాగరాజు.. తన టీమ్ మెంబర్‌ రాధారాణితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యను పట్టించుకోవడం మానేశాడు. అంతటితో ఆగకుండా రాధారాణితో హైదరాబాదులోని ద్వారకానగర్‌లో ఆరునెలలుగా వేరు కాపురం కూడా పెట్టేశాడు. 
 
ఈ వ్యవహారం తెలుసుకున్న అమూల్య.. భర్తను, రాధారాణిని రెడ్ హ్యాండెడ్‌ పట్టుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కుమార్తెను వదిలించుకోవాలని నాగరాజు ప్లాన్ వేస్తున్నాడని.. ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.