శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

ఏపీ జెన్‌కోకు రూ.6756.92 కోట్లు చెల్లించాల్సిందే : కేంద్రం స్పష్టీకరణ

power cuts
ఏపీ జెన్‌కోకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.6,756.92 కోట్లు చెల్లించాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. విద్యుత్ సరఫరా బిల్లు రూ.3,441.78 కోట్లతో పాటు.. సర్ చార్జి కింద రూ.3,315.14 కోట్లను కలిపి మొత్తం రూ.6,756.92 కోట్లను 30 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. పైగా, విభజన చట్టంలోని సెక్షన్ 92 ప్రకారం ఏపీ జెన్‌‍కోకు నిధులు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మొత్తాన్ని నెల రోజుల్లోపు చెల్లించాలని పేర్కొంటూ కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటీ అనూప్ సింగ్ ఉత్తర్వులు జారీచేశారు. 
 
ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 నింబంధనల మేరకు కేంద్రం ఆదేశాలతో తెలంగాణకు ఏపీ జెన్‌కో విద్యుత్ సరఫరా చేసిందని, అందువల్ల ఇపుడు విద్యుత్ బకాయిలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కేంద్రానికి ఉందని ఇంధన శాఖ కార్యదర్శి తన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. 
 
అదేసమయంలో విభజన జరిగిన తర్వాత విద్యుత్ సరఫరా జరిగిందని పేర్కొంటూ ఈ విద్యుత్ బకాయిలను కూడా విభజన సమస్యలతో ముడిపెట్టడం వీల్లేదని స్పష్టం చేశారు. అందువల్ల 30 రోజుల్లోపు మొత్తం బకాయిలను చెల్లించాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది.