గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 డిశెంబరు 2021 (12:01 IST)

అవంతిపొరలో ఉగ్రవాది ఎన్‌కౌంటర్

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని అవంతిపొరలో భద్రతా బలగాలు ఓ ఉగ్రవాదిని ఎన్‌కౌంటర్ చేశాయి. ఆదివారం ఉదయం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. 
 
అవంతిపొరలోని బారాగామ్ పాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ఆదివారం తెల్లవారుజామున స్థానిక పోలీసులతో సహకారంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. 
 
ఆ సమయంలో భద్రతా బలగాలను చూసిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో ఓ ఉగ్రవాది మృతి చెందినట్టు కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు.