శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (22:00 IST)

శాసనమండలి రద్దు దురదృష్టకరం: ఎమ్మెల్సీ మాధవ్

శాసనమండలి రద్దుపై ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. శాసనమండలి రద్దు దురదృష్టకరమన్నారు. రద్దు ఏకపక్ష నిర్ణయమని తప్పుబట్టారు.

నిర్మాణాత్మక చర్యలకు మండలి చాలా ఉపయోగకరమైందని ఆయన అభిప్రాయపడ్డారు. శాసనమండలి రద్దుకు అసెంబ్లీ నిర్ణయించిన తర్వాత లోక్‌సభ ఆమోదం లాంఛనమేనని మాధవ్ చెప్పారు.

ఏపీ శాసనమండలి రద్దు తీర్మానం ఏపీ అసెంబ్లీలో ఆమోదం పొందిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగిన అనంతరం దీనిపై ఓటింగ్ పెట్టారు.

133 మంది ఎమ్మెల్యేలు మండలి రద్దుకు అనుకూలంగా ఓటు వేశారని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. తీర్మానం ఆమోదం పొందిందని సభాపతి తెలిపారు. అనంతరం సభ నిరవదికంగా వాయిదా పడింది.