గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 30 ఏప్రియల్ 2021 (18:16 IST)

500 రోజులకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి ఉద్యమం 500 రోజులకు చేరుకుంది. 500వ రోజుకు చేరుకున్నాయి రాజధాని గ్రామాల రైతుల నిరసనలు. 500 రోజులు పూర్తి సందర్భంగా అమరావతి ఐకాస ఆధ్వర్యంలో సభ నిర్వహించారు.
 
అమరావతి ఉద్యమ భేరి పేరుతో వర్చువల్ విధానంలో సభ.  శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సభ జరిగింది  రైతుల ఉద్యమానికి వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీల మద్దతు. ఏడాదిన్నరగా ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్నారు మహిళలు.
 
2019 డిసెంబర్ 17న అసెంబ్లీలో 3 రాజధానులపై సీఎం జగన్ ప్రకటన చేశారు. 2019 డిసెంబర్ 18 నుంచి రాజధాని గ్రామాల్లో మొదలైన ఉద్యమం. రాజధాని గ్రామాల్లో 3 వేలమందికి పైగా వివిధ కేసులు. రాజధాని చట్టాలకు వ్యతిరేకంగా కోర్టుల్లో న్యాయపోరాటం జరుగుతోంది.
 
500వ రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రధానికి ఐకాస నేతల లేఖలు. సీఎం జగన్‌తో మాట్లాడి నచ్చజెప్పాలని కోరిన ఐకాస నేతలు. వర్చువల్ సభలో రైతులను ఉద్దేశించి చంద్రబాబు, సోము వీర్రాజు, సీపీఐ నేత రామకృష్ణ, శైలజానాథ్, తులసిరెడ్డి తదితరులు మాట్లాడారు.