శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 31 డిశెంబరు 2019 (18:08 IST)

శ్రీవారిని దర్శించుకున్న భక్తుడికి ఉచిత లడ్డు

ఇకపై తిరుమలేశుడిని దర్శించుకున్న ప్రతీ భక్తుడికి ఉచిత లడ్డు అందనుంది. ఇప్పడి వరకూ.. లడ్డూల కోసం క్యూలైన్లలో వేచి చూసే.. భక్తులకు కాస్త సంతోషం కలిగించే మాట ఇది.

తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం ఇవ్వనున్నారు. అలా నెలకు 24 లక్షల లడ్డూలను ఉచితంగా భక్తులకు పంపిణీ చేయనున్నారు.

కౌంటర్లలో ఎలాంటి సిఫార్సు లేఖలు లేకుండానే లడ్డూల కొనుగోలు సౌలభ్యం ఉండనుంది. వైకుంఠ ఏకాదశి నుంచి నూతన విధానం అమలులోకి తీసుకొచ్చేందుకు తితిదే సిద్ధమవుతోంది.