శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం

ఆడ శిశువుల‌ను విక్ర‌యించేందుకు తండ్రి బేరం

8 రోజుల వయస్సు ఉన్న ఆడ శిశువుల‌ను విక్ర‌యించేందుకు ఓ తండ్రి బేరం కుదుర్చుకున్నాడు. ఈ ఉదంతం గురువారం సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర సంచలనం కలిగించింది.

నూజివీడు మండలం కొత్తూరు తండా సిద్దార్థనగర్‌కు చెందిన రజిత వారం క్రితం ఇద్దరు ఆడ కవలల‌కు జన్మనిచ్చింది. మొదటి కాన్పులో రజిత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే నాలుగేళ్ళ క్రితం రాజేష్, రజితలు ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఆడపిల్లలతో ఆర్ధిక ఇబ్బందులు వస్తాయని గ్రహించిన రాజేష్ లక్షన్నర నగదుకు అమ్మడానికి సిద్ధపడ్డాడు. ఇది తెలిసి అత‌ని మామ అల్లుడితో గొడవపడ్డాడు. దీంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దడంతో ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.