ప్రభుత్వానికి సిగ్గు లేదు.. సోమిరెడ్డి
హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గు లేదని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన విలేఖరులతో మాట్లాడుతూ... "విద్యుత్ పీపీఏ ల కొనుగోళ్లు విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేస్తున్నా ప్రభుత్వానికి సిగ్గులేదు. అజయ్ కల్లం ఒక రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారు.
గత ప్రభుత్వంపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం అని అజయ్ కల్లం ఎలా అంటారు? గత ప్రభుత్వం ఎంతకీ విద్యుత్ కొన్నదో అజయ్ కల్లంకి తెలియదా? అజయ్ కల్లం క్రిమినల్ చర్యలు ఈఆర్సీ మీద తీసుకోగలరా? కేంద్రం మా హయాంలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పట్టలేదు.
మోడీ మెడలు వంచి ఏపీకి హోదా తెస్తారు అని అనుకున్నాం. 22 మంది వైసీపీ ఎంపీలు కాబట్టి మడమ తిప్పకుండా ఏపీకి హోదా తీసుకువస్తారు అని అనుకున్నాం. 5గురు ఎంపీలు ఉన్నప్పుడే రాజీనామా చేశారు కాబట్టి...
ఇప్పుడు 22 ఎంపీలు ఉన్న జగన్ మడమ తిప్పకుండా హోదా సాధించాలి" అని హితవు పలికారు.