శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 7 ఆగస్టు 2019 (08:31 IST)

మద్యం నిషేధం అమలుపై జగన్ ప్రభుత్వం తొలి అడుగు

ఏపీలో దశలవారీగా మద్యం నిషేధం అమలు చేసేందుకు జగన్ సర్కార్ దృష్టిసారించింది. తొలి విడతగా 20శాతం మద్యం అమ్మకాలను తగ్గించేలా చర్యలకు శ్రీకారం చుట్టింది. కార్పొరేషన్ ద్వారా మద్యం అమ్మకాలపై విధివిధానాలను రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ఏపీ బేవరెజేస్ కార్పొరేషన్ ద్వారా అమ్మకాలు జరిపేందుకు రంగం సిద్ధమైంది.
 
రాష్ట్ర వ్యాప్తంగా 4,377 షాపులకు గానూ 3,500 షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న షాపులనే అద్దెకు తీసుకుని కొనసాగించాలని ప్రభుత్వం యోచిస్తోంది. మద్యం అమ్మకాల కోసం ప్రతి షాపునకు ఓ సూపర్ వైజర్, ఇద్దరు సేల్స్‌మెన్‌లను కార్పొరేషన్ నియమించుకోనుంది.

ఈ నియామాకాలన్నీ ఔట్ సోర్సింగ్ పద్ధతిన జరపాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు మద్యం నిషేధంపై ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.