సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (09:13 IST)

నేటి నుంచి టిటిడి జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల, శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 13వ తేదీ నుండి ప్రారంభం కానుంది.
 
అర్హత గల విద్యార్థులు https://admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 2 గంటల నుండి జనవరి  25వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని కోరడమైనది.

విద్యార్థుల సౌకర్యార్థం ఇంగ్లీషు, తెలుగు భాషల్లో స్టూడెంట్ మాన్యువల్ ను వెబ్సైట్ లో అందుబాటులో ఉంచడం జరిగింది. విద్యార్థులు దీన్ని పూర్తిగా చదువుకుని ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని కోరడమైనది.