గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (21:08 IST)

టీడీపీని బతికించుకునే బాధ్యత నిమ్మగడ్డదే: రోజా ఫైర్

రాష్ట్రఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై వైసిపి ఎమ్మెల్యే రోజా మరోసారి విరుచుకుపడ్డారు. మార్చి 31 తర్వాత నిమ్మగడ్డను ఎవ్వరూ పట్టించుకోరంటూ వ్యాఖ్యానించారు.

2019లో టీడీపీని ప్రజలు సమాధి చేశారని, ఆ టీడీపీకి జీవం పోయాలని నిమ్మగడ్డ తాపత్రయ పడుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈమేరకు శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు.

ఎక్కువ సర్పంచ్‌ స్థానాలను వైసిపినే గెలుచుకుంటుందని జోస్యం చెప్పారు.  టీడీపీని బతికించుకునే బాధ్యతను నిమ్మగడ్డపై చంద్రబాబు, లోకేశ్‌లు పెట్టారన్నారు.

అందుకే నిమ్మగడ్డ ఇలాంటి తలతిక్క పనులు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఎవరికీ అనుకూలంగా పని చేయాల్సిన అవసరం లేదని, ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూస్తే సరిపోతుందన్నారు.