బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (09:23 IST)

92 మంది విద్యార్థులకి ఇద్దరే టీచర్లు.. ఎక్కడో తెలుసా?

ఇద్దరు ఉపాద్యాయులు.. 92 మంది విద్యార్థులు.. 1నుంచి 8 వరకు తరగతులు... ఇలా ఉంటే విద్యాబోధన ఎలా జరుగుతుందో అదికారులే గ్రహించాలి. ‘‘ఉపాధ్యాయులు లేని పాఠశాలలో మా బిడ్డలకు చదువు ఎలా  అబ్బుతుంది. టీసీలు ఇచ్చేయండి’’ అంటూ ఉపాధ్యాయులపై తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు.

నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని ఉర్దూ ప్రాథమికోన్నత పాఠశాలను 2018లో అప్‌గ్రేడ్‌ చేశారు. అప్పట్లో 60 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం 92మందికి చేరింది. గత ఏడాది వరకు నలుగురు వలంటీర్లు, ముగ్గురు ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించేవారు. ప్రస్తుతం వలంటీర్ల నియామకం జరగలేదు. ఉపాధ్యాయుల్లో ఒకరు బదిలీపై వెళ్లిపోయారు.

ఉన్న ఇద్దరు 1నుంచి 8వ తరగతి వరకు బోధించలేక ఇబ్బంది పడుతున్నారు. ఉపాధ్యాయులు లేక పిల్లలకు చదువు సక్రమంగా అందడం లేదని, టీసీలు ఇచ్చేస్తే ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించుకొంటామని  తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అదనపు ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది.