ఓటుకు డబ్బు అడిగేవారిని జైల్లో పెట్టి నాలుగు కుమ్మాలి: మంచు విష్ణు
చిత్తూరుజిల్లా చంద్రగిరి మండలం రంగంపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓటు హక్కును వినియోగించుకున్నారు సినీ హీరో మంచు విష్ణు. పోలింగ్ కేంద్రం ఖాళీగా ఉండడంతో నేరుగా వెళ్ళి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లే లేకపోవడంతో ఆశ్చర్యపోయారు మంచు విష్ణు.
అక్కడి అధికారులతో మాట్లాడారు. మందకొడిగా ఓటింగ్ జరుగుతోందని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఓటు వేసిన తరువాత మంచు విష్ణు మీడియాతో మాట్లాడారు. ఓటు వేయాలంటే డబ్బు అడిగే వారిని జైల్లో పెట్టి నాలుగు తగిలించాలి. ఓటు మన ఆయుధం.. మన హక్కు. ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోండి.
ఎంతోమంది వృద్ధులు పోలింగ్ కేంద్రం వద్ద ఓటును వేసేందుకు వస్తున్నారు. యువతీయువకులు కూడా వారిని స్ఫూర్తిని తీసుకోండి అంటూ పిలుపునిచ్చారు మంచు విష్ణు. ఎంపిటిసి, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓటు వేయడానికి ఓటర్లు రాకపోవడంపై మాత్రం మంచు విష్ణు ఆశ్చర్యానికి గురయ్యారు.