సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 23 నవంబరు 2023 (09:53 IST)

పిడుగురాళ్లలో దారుణం.. ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య

murder
dఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కిరాయి మూకలు రెచ్చిపోతున్నారు. ఇలాంటి వారికి కొందరు పోలీసులు సైతం వత్తాసు పలుకుతుండటంతో మరింతగా రెచ్చిపోతున్నారు. తాజా పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్లలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దారుణ హత్యకు గురయ్యారు. బుధవారం అర్థరాత్రి సమయంలో ఆ సమీప బంధువులే ఈ దారుణానికి పాల్పడ్డారు. కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపేశారు. 
 
ఈ హత్యలపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను సాంబశివరావు, భార్య ఆదిలక్ష్మి, కుమారుడు నరేశ్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, హత్యలకు సంబంధించి ముప్పాళ్ల పోలీస్ స్టేషన్‌లో నరేశ్ భార్య మాధూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అదేసమయంలో ఈ హత్యలకు పాల్పడిన నిందితులు కూడా స్టేషన్‌లో లొంగిపోయారు.