శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 26 మార్చి 2019 (16:13 IST)

మా నాన్న కారుకే అడ్డొస్తావా అంటూ యువకుడిని చితకబాదారు...

మా నాన్న కారుకే సైడ్ ఇవ్వవా అంటూ ఓ యువకుడు విద్యార్థిపై దాడికి పాల్పడిన సంఘటన సోమవారం చింతల్‌లో చోటు చేసుకుంది. గాజులరామారం ప్రాంతానికి చెందిన అశు హిమాయత్‌నగర్‌లోని హైందవి కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం నాడు కాలేజీ నుండి తిరిగి వచ్చే సమయంలో అతని బైక్‌ను వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. 
 
ఈ క్రమంలో అతను చూసి నడపండి అంటూ కారు డ్రైవర్‌కి సూచించాడు. దీంతో కారు వెనకే వస్తున్న మరో ముగ్గురు యువకులు మా నాన్న కారుకే సైడ్ ఇవ్వవా అంటూ అతడిపై దాడికి దిగారు. బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.