మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By
Last Modified: సోమవారం, 25 మార్చి 2019 (17:37 IST)

పరీక్షలకు సిద్ధమవుతున్న భారత విద్యార్థులకు ప్రధాన ఆందోళన గణితం-సైన్స్: సర్వే

బ్రెయిన్లీ నిర్వహించిన సర్వేలో దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, హైదరాబాద్ మరియు ఇతర నగరాల నుండి 5000 విద్యార్ధుపై సర్వే చేసింది.
 
పరీక్షలు నడుస్తున్న ఈ సమయంలో, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్ధులు షెడ్యూల్ తయారి చేసుకొని, స్టడీ మెటీరియల్ స్టాక్లను సిద్ధం చేసుకొని, వారి ఆందోళనను దూరం చేసుకోవడానికి  ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థుల సాధారణ దృక్పథాన్ని అర్ధం చేసుకోవటానికి, బ్రెయిన్లీ, ప్రపంచంలోని అతిపెద్ద ఆన్లైన్ పీర్-టు- పీర్ లెర్నింగ్ కమ్యూనిటీ, ఇటీవల భారతదేశంలోని తమ యూజర్ బేస్ కోసం ఒక సర్వేని నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 5000 మంది విద్యార్థులను చురుకుగా పాల్గొన్నారు, మరియు హైదరాబాద్ నుండి ఈ సర్వేలో పరీక్షల ఆందోళనల గురించి కీలకమైన అంశాలు వచ్చాయి.
 
ఈ సర్వేలో హైదరాబాద్ నుండి విద్యార్థులకు గణితం మరియు సైన్స్ రెండు ఆందోళన కలిగించే సుబ్జెక్ట్లుగా తేలింది. సుమారు 50% పైగా విద్యార్ధులు ఈ రెండు సబ్జక్ట్స్ కోసం విస్తృతంగా కష్టపడుతున్నారు. అంతేకాకుండా, వాటిలో 48% మంది  విద్యార్ధులు ఈ విషయాల్లో మెరుగుపరచాల్సిన అవసరం ఉందని భావించారు. గణితం మరియు సైన్స్ వంటి అంశాల్లోని భావాలను మరింత లోతుగా అర్ధం చేసుకోవడానికి వేరే విధానం అవసరాన్ని ఈ ఆవిష్కరణ తెలియజేస్తుంది. దీనితో పాటు, ఆంగ్లం మరియు తెలుగు వంటి భాషా విషయాలలో కూడా 30% కంటే ఎక్కువ విద్యార్ధులకు ముఖ్యమైన ప్రాధాన్యతగా పరిగణించబడ్డాయి. 
 
ఇతర అంశాలతో పాటు తమను తాము సిద్ధం చేయడానికి, విద్యార్థులు అనేక పద్ధతులను అనుసరిస్తున్నారు. పుస్తకాలు మరియు నోట్స్ మెజారిటీ 45%తో ఆనందించగా, ఆన్లైన్ వేదికలు మరియు మూలాలను(సోర్సెస్) (40%) ప్రైవేటు ట్యూటర్లకు (10%) మంచి అభ్యాసం మరియు అభ్యాసన కోసం ఇష్టపడుతున్నట్లు తేలింది.
 
ఒత్తిడి మరియు ప్రదర్శన ఆందోళన పరీక్షల సమయంలో ప్రతి విద్యార్థి యొక్క ప్రధాన సమస్యలలో ఒకటి. ఇచ్చిన ఆప్షన్లలో, విద్యార్ధులు తమ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, నేర్చుకున్న వాటిని మర్చిపోతారు. ఈ విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశలు మరియు ఆకాంక్షలు అలాగే ఇతరుల కోసం మెరుగైన పనితీరు మరియు వైఫల్యాలు తప్పించుకోవడం గురించి వారి సొంత అంచనాలను కలిసే పోరాడుతున్నారు. 
 
ఎక్కువ శాతం విద్యార్థుల, సంగీతం వింటున్నారు, మిగిలిన వారు సినిమాలను చూడటం, ఆటలు ఆడటం, కొద్ది పాటి నిద్ర తీసుకోవడం మొదలైనవి చేస్తున్నారు. ఈ సర్వే అనేది భారతదేశం అంతటా పరీక్షల కోసం సిద్ధం అవుతున్న విద్యార్ధులు ఎలా అధ్యయనం చేస్తున్నారో మరియు వారి విస్తృతమైన ప్రయత్నాలను స్పష్టంగా తెలియజేస్తుంది.
 
ఈ సందర్భంగా సర్వే కోసం మాట్లాడుతూ.. మిచల్ బోర్కౌస్కి, కో-ఫౌండర్ మరియు సీఈఓ, బ్రెయిన్లీ....”భారతదేశం బ్రెయిన్లీకి ఒక అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీ. భారతీయ విద్యార్థులు పరీక్షల ప్రాముఖ్యత గురించి బాగా తెలుసుకున్నారని, మరియు ఎప్పటికప్పుడు నేర్చుకోవడం కోసం సమర్థవంతమైన విధానాల కోసం తరచూ వెతుకుతూ ఉండడం మేము గమనించాము. పరీక్షలకు సిద్ధమవుతున్న హైదరాబాద్ విద్యార్ధుల కొరకు ఒక ప్రధాన ఆందోళన కలిగించే సుబ్జెక్ట్లు గా గణితం & సైన్స్ ఉన్నాయి, వీటితో పాటు భాషా సబ్జెక్టుపై కూడా కొంచెం ఆందోళన చూపిస్తుంది. బ్రెయిన్లీ ప్రస్తుతం ఇంగ్లిషుతో సంబంధమున్న వివిధ విషయాల గురించి విద్యార్థులకు సహాయం చేస్తున్నది మరియు ఈ సబ్జెక్టుపై విద్యార్థుల ఎక్కువ ట్రాక్షన్ చూస్తున్నది." అని అన్నారు.
 
నెలవారీగా 15 మిలియన్లు భారతీయ యూజర్-బేస్ పెరుగుతున్నందున, డిజిటల్ యుగంలో విద్యావంతులను చేయటానికి బ్రెయిన్లీ ఒక ప్రధాన సాధనంగా ఉద్భవించింది. దాని పీర్-టు-పీర్ లెర్నింగ్ విధానం ద్వారా, పరీక్షల కోసం సిద్ధం అవుతున్న విద్యార్ధులకు కీలకమైన అకాడమిక్ భావనలను అర్థం చేయడం ద్వార వారి పరీక్షలకు ఉత్తమంగా సిద్ధం చేయటానికి బ్రెయిన్లీ సహాయ పడుతున్నది. బ్రెయిన్లీ గురించి మరింత తెలుసుకోవడానికి brainly.inను సందర్శించవచ్చు.