శుక్రవారం, 22 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 15 నవంబరు 2021 (10:23 IST)

కృష్ణానదిలో పవిత్రస్నానాలకు వెళ్లిన ముగ్గురు యువకుల గల్లంతు

కృష్ణానదిలో పవిత్రస్నానాలకు వెళ్లిన ముగ్గురు యువకుల గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు వద్ద కృష్ణానదిలో ఈ ఘటన జరిగింది. 
 
కార్తీక మాసం రెండో సోమవారం సందర్భంగా కార్తీక స్నానాలు చేసేందుకు తోట్లవల్లూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కృష్ణానది పాయలోకి వెళ్లి గల్లంతయ్యారు. 
 
ఒకే గ్రామానికి చెందిన 20 ఏళ్లలోపు యువకులు నరేంద్ర, నాగరాజు, పవన్‌లు నీటిలో గల్లంతు అవ్వడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఇప్పటివరకు ఇరువురి మృతదేహాలు లభ్యం కాగా, మరొక యువకుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు.