గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 20 నవంబరు 2023 (16:49 IST)

టీమిండియా దివాళాకోరు ఆటతీరుకి మా సోదరుడు గుండెపోటుతో మరణించాడు

heart stroke
టీమిండియా దివాళాకోరు ఆటతీరుతో తమ సోదరుడు గుండెపోటుతో చనిపోయాడని తిరుపతిలో ఓ అన్నయ్య ఆవేదన వ్యక్తం చేసాడు. నిన్న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన ఆటను చూస్తూ తన తమ్ముడు కుర్చీలో కూర్చుని వుండగానే... ఒరిగిపోయాడని ఆవేదన వ్యక్తం చేసాడు.
 
వివరాల్లోకి వెళితే... తిరుపతి పరిధిలోని జ్యోతికుమార్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిన్న భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ను తిలకిస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ దారుణంగా వుండటాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఐతే ఫీల్డింగులో రాణిస్తారులే అనుకుని మ్యాచుని చూస్తున్నాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 3 వికెట్లో పోగొట్టుకోవడంతో ఆనందంలో నిండాడు. ఐతే ఆ తర్వాత క్రమంగా భారత్ ఓటమి అంచులకు చేరడంతో దాన్ని జీర్ణించుకోలేని జ్యోతి కుమార్ గుండె పోటుకి గురయ్యాడు. కాళ్లూ చేతులు చల్లబడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.