సోమవారం, 26 జనవరి 2026
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 మే 2022 (11:47 IST)

ఏపీ ప్రజలకు శుభవార్త.. తగ్గనున్న టమోటా ధరలు.. ఎలాగంటే?

Tomato
ఏపీ ప్రజలకు శుభవార్త. టమోటా ధరలు తగ్గనున్నాయని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటాను అందుబాటులో ఉంచామని చెప్పారు. అలాగే మార్కెట్ రేట్ కంటే 15 రూపాయలు తక్కువగా రైతు బజార్లలో టమాటాలు అందజేస్తామని ప్రకటించారు.
 
విజయవాడ, గుంటూరు, పల్నాడు, ఏలూరు, విశాఖపట్నం రైతు బజారుల్లో టమాటాల కొనుగోలు ప్రజల నుండి భారీ స్పందన కనిపించిందని.. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాకాణి కోరారు.
 
ధాన్యాన్ని ఆర్బీకేల సాయంతో మిల్లులకు తరలించేందుకు అంతా సిద్ధమైందని కాకాణి చెప్పారు.  రైతులకు మేలు చేయడంలో భాగంగా మిల్లర్ల పాత్రను తప్పించి ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ చేపట్టాము. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లోకే ఆధార్‌ నంబర్‌ అనుసంధానంతో నగదు జమ అవుతుంది. మిల్లర్ల ప్రమేయానికి ఆస్కారం లేదని పేర్కొన్నారు