1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 8 ఏప్రియల్ 2020 (11:22 IST)

కరోనాపై పోరుకు టీటీడీ భారీ విరాళం, ఎపి సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ. 19 కోట్లు

కరోనాను అరికట్టేందుకు ఎవరికి తోచిన విధంగా వారు సాయం చేస్తూనే ఉన్నారు. ఆయా ప్రభుత్వాలకు విరాళాల రూపంలో అందిస్తున్నారు. కరోనాపై పోరుకు టీటీడీ కూడా భారీ విరాళం ప్రకటించింది.

తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున రూ. 19 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్నట్టు ఈవో అనిల్ సింఘాల్ తెలిపారు. ఇప్పటికే మొదటి విడతగా చిత్తూరు జిల్లా అధికారులకు రూ. 8 కోట్లు ఇచ్చామని… మిగితా రూ. 11 కోట్లను ఏపీ ప్రభుత్వ సమాయ నిధికి బదిలీ చేస్తామని తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా నిరాశ్రయులు అయిన వారికి ఆహారం అందిస్తున్నట్టు చెప్పారు.

ప్రతి రోజు యాచకులు, కూలీలు, పేద వారి కోసం ప్రత్యేకంగా లక్షా 20 వేల ఆహారపు ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేసే వరకూ తమ వంతు సాయం చేస్తూనే ఉంటామన్నారు.

అంతేకాదు తిరుమలలో స్వామివారి దర్శనం నిలిపేశామన్న అనిల్ సింఘాల్ ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారికి జరగాల్సిన అన్నీ నిత్యపూజలు జరుగుతున్నాయని తెలిపారు.