గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (20:52 IST)

వెంకన్న ఆస్తులకు జియో ఫెన్సింగ్

తిరుమల శ్రీవారికి భక్తుల కానుకలు భారీగా అందిస్తూ వుంటారు. తాజాగా వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) నడుం బిగించింది. ఇందులో భాగంగా వెంకన్న ఆస్తులకు జియో ఫెన్సింగ్ చేసేందుకు టీటీడీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
 
బుధవారం స్థిరాస్తుల‌కు జియో ఫెన్సింగ్‌పై టీటీడీ ప‌వ‌ర్ ప్ర‌జెంటేష‌న్‌ను తిల‌కించింది. ఆ త‌ర్వాత వెంక‌న్న ఆస్తుల ప‌రిర‌క్ష‌ణ‌కు జియో ఫెన్సింగ్ స‌రిగ్గా స‌రిపోతుంద‌ని తీర్మానించింది.
 
వెనువెంట‌నే దేశ‌వ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తుల‌కు జియో ఫెన్సింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వెంక‌న్న ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా జియో ఫెన్సింగ్ చేయిస్తున్న‌ట్లుగా టీటీడీ ప్ర‌క‌టించింది.