సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: గురువారం, 6 మే 2021 (17:58 IST)

వారం వ్యవధిలో ఇద్దరు ట్రిపుల్ ఐటీ ల్యాబ్ అసిస్టెంట్లు కరోనాతో మృతి: శెలవులు ప్రకటించని అధికారులు

నూజివీడు ట్రిపుల్ ఐటీలో కరోనా విలయ తాండవం చేస్తోంది. లాబ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు(36) ఏలూరులో చికిత్స పొందుతూ కరోనాతో మృతి చెందారు. ఇతనికి భార్య ఒక బాబు (9),  పాప(4) వున్నారు.
 
ట్రిపుల్ ఐటీలో మరికొంత మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు సమాచారం. 
ట్రిపుల్ ఐటీలో కరోనా నేపధ్యంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది మరియు విద్యార్థులు  ఆందోళన చెందుతున్నారు. 
 
వారం వ్యవధిలో ఇద్దరు లాబ్ అసిస్టెంట్లు మృతి చెందారు. మరికొంత మంది సిబ్బందికి పాజిటివ్ రాగా కనీసం శెలవలు కూడా ప్రకటించడంలేదు ట్రిపుల్ ఐటీ అధికారులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.