శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 25 అక్టోబరు 2021 (21:48 IST)

కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవ ఎన్నిక

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేయర్‌ ఎన్నికకు టీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు.

ఎన్నిక అనంతరం మేయర్‌ శివప్రసన్న మీడియాతో మాట్లాడుతూ, కాకినాడ నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. సహచర కార్పొరేటర్ల సహకారం ఎప్పటికప్పుడు తీసుకుంటానన్నారు. సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
 
ఇప్పటి వరకూ మేయర్‌గా ఉన్న సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నెల 12న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈ రోజు ఉదయం ఎన్నికలు నిర్వహించారు.