సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 13 అక్టోబరు 2021 (17:52 IST)

కోర్టును ఆశ్రయించిన కాకినాడ మేయర్...22 వ‌ర‌కు కోర్టు స్టే!

కాకినాడ మేయర్ సుంకర పావని (టీడీపీ)పై ఇటీవల అవిశ్వాస తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో పావని తన మేయర్ పదవిని కోల్పోయారు. ఈ క్రమంలో ఆమె కోర్టుకు వెళ్లారు. ఆమె పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఫలితాలను ఈనెల 22 వరకు ప్రకటించవద్దని ఆదేశించింది.
 
మరోపక్క, పావనిని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఈరోజు ఏపీ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దీంతో ప్రభుత్వ తీరుపై పావని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నపళంగా తనను పదవి నుంచి తొలగించడం కోర్టు ధిక్కారణ అవుతుందని చెప్పారు. గెజిట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తనను తొలగించినప్పటికీ, తాను మేయర్ హోదాలోనే కొనసాగుతానని తెలిపారు.