శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: బుధవారం, 20 అక్టోబరు 2021 (23:23 IST)

కరోనాను ఎదుర్కొనేందుకు వాక్సినేషన్ ఒక్కటే మార్గం: విజయవాడ జిల్లా కలెక్టర్ జె.నివాస్

థర్డ్ వేవ్ హెచ్చరిక నేపథ్యంలో కరోనాను ఎదుర్కొనేందుకు వాక్సినేషన్ ఒక్కటే సురక్షిత  మార్గమని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అన్నారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి బుధవారం సాయంత్రం వైద్యాధికారులతో కలిసి మండల, మునిసిపల్ స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమీక్షించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ థర్డ్ వేవ్ లో కొవిడ్ ఉదృతి అధికంగా ఉండే అవకాశం ఉంటుందన్న వైద్య నిపుణుల హెచ్చరికలతో అధికారులు అపప్రమత్తమై ప్రత్యేక వాక్సినేషన్ డ్రైవ్ చేపట్టాలన్నారు. .  ప్రభుత్వ నిబంధనల ననుసరించి ప్రతీ ఒక్కరూ కొవిడ్ వాక్సినేషన్ తీసుకునే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


సమాజంలోని అన్నివర్గాల వారి సహకారంతో నూరుశాతం వాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.   జిల్లాలో ఇంతవరకు  43 లక్షల 59 వేల  803 మందికి కొవిడ్  వాక్సినేషన్ 7వేయడం జరిగిందని, వీరిలో 27 లక్షల 84 వేల  597 మందికి మొదటి డోసు, 15 లక్షల 75 వేల  206 మందికి రెండవ డోసు వాక్సినేషన్ జరిగిందన్నారు.


18 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతీ ఒక్కరికి వాక్సినేషన్ జరిగినప్పుడే కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టన్నారు .  గ్రామ/వార్డ్ సచివాలయాలు పరిధిలోని వాలంటీర్లు వారి పరిధిలో ఇంకా వాక్సిన్ వేయించుకొని వారి వివరాలతో జాబితాను సిద్ధం చేసి,  సంబంధిత ఏ. ఎన్ . ఎం. లతో సమన్వయము చేసుకుని అందరికి వాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


జిల్లాలో 45 సంవత్సరాల వయస్సు దాటినవారిలో 90 శాతానికి పైగా ప్రజలు వాక్సిన్ వేయించుకున్నారని, కొంతమంది యువత వాక్సినేషన్ కు సుముఖంగా లేరని తెలుస్తున్నదని, వారిలో వాక్సిన్ పట్ల ఉన్న అపోహను తొలగించి వాలంటీర్ల ద్వారా  చైతన్యం తీసుకురావాలని ఎంపిడిఓ లను కలెక్టర్  ఆదేశించారు.


అదేవిధంగా విజయవాడ కార్పొరేషన్ పరిధిలో 64 శాతం మంది మాత్రమే కోవిడ్  వాక్సిన్  వేయించుకున్నారన్నారు. 18 నుండి ప్రతీ ఒక్కరూ కోవిడ్ వాక్సినేషన్ వేయించుకునేలా అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు.  జిల్లాలోని ప్రతీ ప్రభుత్వ పి .హెచ్.సి  ఆసుపత్రులలోనూ ప్రతీరోజు వాక్సిన్ వేస్తున్నారని, ఈ విషయంపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు.