మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 1 నవంబరు 2020 (12:19 IST)

వరలక్ష్మి హత్య కేసు సంచలనం.. ఇద్దరితో టచ్‌లో వుందా?

వరలక్ష్మి హత్య కేసు సంచలనం రేపుతోంది. గాజువాక వరలక్ష్మి హత్యకేసులో కొత్తకోణం బయటకి వచ్చింది. ప్రియురాలు వరలక్ష్మిని హత్య చేసిన కేసులో ప్రేమోన్మాది అఖిల్ సాయితో పాటు రాము అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు గాజువాక పోలీసులు. అఖిల్ సాయి, రాముతో వరలక్ష్మికి ఉన్న సాన్నిహిత్యం మీద పోలీసులు విచారణ చేస్తున్నారు.
 
అఖిల్‌తో టచ్ ఉంటూనే, రాముతో వరలక్ష్మీ సాన్నిహిత్యం ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం సాయి బాబా టెంపుల్ వద్ద రాముతో ఉన్న వరలక్ష్మి ఉండడం, అలా రాముతో సాన్నిహిత్యంగా ఉండటంతో తట్టుకోలేక ఈ దారుణానికి అఖిల్ సాయి ఒడిగట్టినట్టు చెబుతున్నారు. ఇక వరలక్ష్మి బంధువులు కేజీహెచ్ మార్చురీ వద్దకు చేరుకున్నారు. మరికాసేపట్లో వరలక్ష్మి మృత దేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.