సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 8 నవంబరు 2024 (19:41 IST)

వైకాపా సోషల్ మీడియా సైకో వర్రా రవీంద్రా రెడ్డి అరెస్టు

varra ravinder reddy
వైకాపా సోషల్ మీడియా సైకో కార్యకర్త వర్రా రవీంద్రా రెడ్డిని ఏపీ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. శుక్రవారం ఆంధ్రా - తెలంగాణ రాష్ట్రాల ప్రాంతాలైన కర్నూలు - మహబూబ్ నగర్ సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవలే వర్రా రవీంద్రా రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని 41ఏ నోటీసులిచ్చి వదిలేశారు. 
 
ఆ తర్వాత మరో కేసులు అరెస్టు చేసేందుకు కడప పోలీసులు ప్రయత్నించగా, పోలీస్ స్టేషన్ నుంచి చాకచక్యంగా తప్పించుకున్నారు. ఇందుకు పోలీసులు సైతం సహకరించినట్టు సమాచారం. దీనిపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఏపీ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టి శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. 
 
వర్రా రవీంద్రా రెడ్డి గత వైకాపా ప్రభుత్వంలో ఆ పార్టీ నేతల అండ చూసుకుని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేశ్, భువనేశ్వరి, వీరి కుటుంబ సభ్యులు, వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ, వైఎస్ సునీత ఇలా ప్రతిపక్షానికి చెందిన అనేక మంది నేతలపై నీచాతి నీచంగా పోస్టులు పెట్టి పైశాచికానందం పొందిన విషయం తెల్సిందే. ఇప్పటికీ పాపం పండి పోలీసుల చేతికి చిక్కాడు.