1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 జులై 2022 (11:27 IST)

బెజవాడలో మటన్ మాఫియా.. ప్రజల ప్రాణాలతో చెలగాటం

mutton shop
బెజవాడలో మటన్ మాఫియా చెలరేగిపోతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. పాచిపోయిన మటన్‌ను, బీఫ్‌ను కలిపేసి యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. పైగా, ఆరోగ్య శాఖ అధికారులు పలుమార్లు తనిఖీలు చేపడుతున్నప్పటికీ మటన్ వ్యాపారులు తన నిర్లక్ష్య వైఖరిని ఏమాత్రం వీడటం లేదు. 
 
నిజానికి ఇటీవలి కాలంలో మటన్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒకపుడు రూ.500గా ఉండే కేజీ మటన్ ధర రూ.1000కు చేరుకుంది. కరోనా కష్టకాలం నుంచే మాంసాహార ప్రియులకు ఈ పెరిగిన ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. మాంసం ఎక్కువగా ఆరగించడం వల్ల శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ అందుతుందంటూ వైద్య నిపుణులు ప్రచారం చేశారు. దీంతో ప్రతి ఒక్కరూ మాంసాన్ని ఆరగించడం మొదలుపెట్టడంతో వీటి ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 
 
ప్రజల డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో కొందరు వ్యాపారులు మటన్ మాఫియాకు తెరతీశారు. ఎక్కువ రోజులు నిల్వచేసిన, పాచిపోయిన మాంసాన్ని యధేచ్చగా విక్రయిస్తున్నారు. అలాగే, మేకలు, పొట్టేళ్ళ మాంసంతో పాటు బీఫ్ మాంసాన్ని కూడా విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. 
 
ఈ విషయం వెలుగులోకి రావడంతో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ అధికారులు స్థానికంగా ఉండే పలు మాంసం దుకాణాలపై దాడులు చేసి నిర్వహించాయి. ఈ క్రమంలో అనేక షాకింగ్ విషయాలు తెలుసుకుని, ఎవరనా నిల్వచేసిన, కుళ్లిపోయిన, బీఫ్ మాంసాలను మటన్‌లో కలిపి విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన, దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు.