శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 అక్టోబరు 2020 (13:15 IST)

విజయవాడ నగరానికి మణిహారం... కనకదుర్గ ఫ్లైఓవర్ ఏరియల్ వ్యూ

విజయవాడ నగరానికి మణిహారంగా భావించి నిర్మించిన కనకదుర్గ ఫ్లైఓవర్‌ను కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువాం ప్రారంభించారు. వర్చువల్‌ కార్యక్రమం ద్వారా ఈ ప్రారంభోత్సవం జరిగింది. 
 
సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ఈ కార్యక్రమంలో జగన్ పాల్గొనగా, ఢిల్లీ నుంచి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. రూ.502 కోట్లతో, ఆరు వరుసలతో 2.6 కి.మీ మేర ఈ వంతెనను నిర్మించారు. 900 పని దినాలలో దీన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే.
 
కాగా, ఫ్లై ఓవర్ ప్రారంభం తర్వాత రూ.7,584 కోట్లతో నిర్మించనున్న మరో 16 ప్రాజెక్టులకు వారు భూమిపూజ చేశారు. రూ.8,007 కోట్ల రూపాయలతో ఇప్పటికే పూర్తయిన పది ప్రాజెక్టులను వారు జాతికి అంకితం చేశారు.