మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 అక్టోబరు 2020 (14:55 IST)

ప్రేమించలేదని.. యువతి ఇంటికెళ్లి చంపేసిన ప్రేమోన్మాది... ఎక్కడ?

విజయవాడ నగరంలో ఓ దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మోది రెచ్చిపోయాడు. ప్రేమించట్లేదన్న అక్కసుతో ఓ యువతిని కత్తితో పొడిచి చంపేశాడు. ముఖ్యంగా, యువతి ఇంటికి వెళ్లి చంపడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడలోని మాచవరం పోలీసు స్టేషన్ పరిధిలోని క్రీస్తురాజపురంకు చెందిన ఓ యువతి స్థానికంగా ఉండే ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోంది. ఈ యువతిని స్వామి అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించసాగాడు. 
 
తనను ప్రేమించాలంటూ పదేపదే వేధించసాగాడు. దీనికి ఆమె అంగీకరించకపోవడంతో ఆమె ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో పొడిచాడు. అనంతరం తానూ కత్తితో పొడుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. 
 
యువతి, ప్రేమోన్మాదిని వైద్య సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, యువతికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు స్వామి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం అందాల్సి ఉంది. ఈ ఘటనపై మహిళా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దాడులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సమాఖ్య ఏపీ అధ్యక్షురాలు దుర్గా భవాని ఆగ్రహం వ్యక్తం చేశారు.