విజయవాడలో దారుణం : సీపీ ఆఫీస్ ఉద్యోగి దారుణ హత్య

gun shot
ఠాగూర్| Last Updated: ఆదివారం, 11 అక్టోబరు 2020 (17:20 IST)
విజయవాడలో దారుణం జరిగింది. విజయవాడ పోలీస్ కమిషనరు కార్యాలయంలో పని చేస్తున్న మహేష్ అనే ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండుగులు కాల్చి చంపారు. ఈ ఘటన బైపాస్ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో జరిగింది. ఇదే ఘటనలో మరో వ్యక్తి కడుపులోకి కూడా బులెట్లు దిగాయి.

విషయం తెలుసుకున్న పోలీసులు... ఘటనా స్థలికి చేరుకున్న వివరాలు సేకరిస్తున్నారు. ఓ పథకం ప్రకారం ప్రణాళిక వేసిన దుండుగులు, మహేశ్‌ను హతమార్చారని పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నిందితుల ఆచూకీ కోసం సమీపంలోని అన్ని సీసీ కెమెరాలనూ పరిశీలిస్తున్నామని సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు.దీనిపై మరింత చదవండి :