మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 26 జనవరి 2022 (15:28 IST)

విజయవాడ పోలీస్ సాంకేతిక స‌ల‌హాదారు కొండ‌ల‌రావు హ్యాట్రిక్

పోలీసుల‌కు సాంకేతిక ప‌రిజ్ణ్నాన్ని అందిస్తున్న వ్య‌క్తికి మూడోవసారి ఉత్తమ సాంకేతిక సలహాదారుగా అవార్డు వ‌చ్చింది. విజయవాడ పోలీసులకు  సాంకేతిక సలహాదారుగా వ్యవహరిస్తున్న బిక్కిన కొండలరావు మరోసారి ఉత్తమ సేవా పురష్కారాని అందుకున్నారు. 
 
కష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో జరిగిన  గణతంత్ర వేడుకల్లో ఆయన ఈ అవార్డును కలెక్టర్, ఎస్పీ  చేతుల మీదుగా అందుకున్నారు. విజయవాడ పోలీసులకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడంతో పాటు సాంకేతిక పద్దతుల వినియోగంలో అమూల్యమైన నిరంతరం సేవలను అందిస్తున్నారు. అందుకుగాను ఉత్తమ ఐటీ సలహాదారుగా ఎంపిక చేశారు. సాంకేతిక వనరుల నిర్వహణ, టీమ్‌ మేనేజ్‌మెంట్, సామర్థ్యం పెంపు, సాంకేతిక శిక్షణ, డాష్‌ బోర్డు నిర్వహణ వంటి అనేక విభాగాల్లో కొండలరావు విశిష్ట సేవలు అందిస్తున్నారు. 
 
 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తనకు వరుసగా మూడోవసారి అవార్డు దక్కడం తన బాధ్యతలను మరింత పెంచిందన్నారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ డి.గౌతమ్‌ సవాంగ్, కష్ణా జిల్లా ఎస్పీలకు కతజ్ఞతలు తెలిపారు. త‌న సేవ‌ల‌ను మ‌రింత‌గా పోలీసు శాఖకు అందించే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని చెప్పారు.