శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (12:27 IST)

వందేభారత్‌ రైలులో పనిచేయని ఏసీలు.. ప్రయాణీకుల నానా తంటాలు

vande bharat
వందేభారత్‌ రైలులో శుక్రవారం సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖపట్నం-సికింద్రాబాద్ (20833) వందేభారత్‌ రైల్లో కొన్ని బోగీల్లో ఏసీలు పనిచేయకపోవడంతో ప్యాసెంజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
 
ఓవైపు మండిపోతున్న ఎండలు, మరోవైపు బోగీల్లో మూసి ఉన్న కిటికీలు.. వెరసి ప్రయాణికులు ఉక్కపోత భరించలేక ఇబ్బందులు పడ్డారు. కొందరు ప్రయాణికులు రైల్వే ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. 
 
రైలు రాజమండ్రి స్టేషన్‌కు చేరుకున్నాక కొందరు టెక్నీషియన్లు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి మరమ్మతు చేశారు. చివరకు సాయంత్రం 5.30 గంటలకు రైలు మళ్లీ విజయవాడ నుంచి బయలుదేరింది.