గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజయవాడ , శుక్రవారం, 20 ఆగస్టు 2021 (10:40 IST)

విశ్వ బ్రాహ్మ‌ణ జ‌నాభా 7 ల‌క్ష‌లు కాదు... 25 ల‌క్ష‌లు! స‌ర్వే ప్రారంభం!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో విశ్వ‌బ్రాహ్మ‌ణుల జ‌నాభా 25 ల‌క్ష‌లు అయితే, ప్ర‌భుత్వం దానిని కేవ‌లం 7 ల‌క్ష‌ల‌ని పేర్కొంటోంద‌ని ఆంధ్ర‌ప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పావూలూరి హనుమంతరావు చెప్పారు. దీనిని నిరూపించేందుకు తామే జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ ప్రారంభిస్తున్నామ‌ని తెలిపారు. ఈ లిస్టును ఆధార్ కార్డుల‌తో స‌హా సేక‌రించి, ప్ర‌భుత్వానికి నివేదిస్తామ‌ని చెప్పారు.

క‌ర్నూలు జిల్లా కందిమల్లాయపల్లెలోని వీర బ్రహ్మేంద్రస్వాముల వారి మఠంలో ఆంధ్ర‌ప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పావూలూరి హనుమంతరావు, ప్రధాన కార్యదర్శిగా దువ్వూరి నరసింహచారితోపాటు ఇత‌ర పాల‌క‌వ‌ర్గం ఎన్నిక‌యింది. తామె రెండు నెలల్లో అన్ని జిల్లాల్లో పర్యటించి రాష్ట్ర కార్యవర్గం, వివిధ అనుబంధ‌ కమిటీలకు జిల్లాకు 20 మందిని ఎంపిక చేస్తామ‌ని సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా పావూలూరి హనుమంతరావు తెలిపారు.

అలాగే విశ్వ‌బ్రాహ్మ‌ణ జనాభా లిస్ట్ సేకరణ చేస్తామని తెలిపారు. రాష్ట్ర సంఘ కార్యాలయం నిర్మాణం కోసం దాదాపుగా 18 లక్షల రూపాయలు దాతలు ప్రకటించారు. ముఖ్యమైన 5 అంశాలతో జాతి సర్వతోముఖాభివృద్దికి పాటుబడతామని కొత్త పాల‌క వ‌ర్గం ప్ర‌క‌టించింది. ప్రస్తుతం రాష్ట్ర కార్యాలయం కోసం తాత్కాలికంగా బ్ర‌హ్మంగారి మఠంలోని విరాట్ భవనంలో ఒక గదిని కేటాయించారు. ప్రస్తుత జిల్లా కమిటీలే ఇపుడు కొనసాగాతాయి.

ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రహ్మణ సంఘం ఏ రాజకీయ పార్టీ కి అనుభంధం కాదని, కాని సంఘీయులు ఏ పార్టీలో ఉన్నా, వారి ఏదుగదలకు సంఘం సపోర్ట్ చేస్తుందన్నారు.