గురువారం, 7 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (19:30 IST)

ఉత్కంఠను రేపుతున్న అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్

YS Avinash Reddy
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌పై విచారణ ఉత్కంఠ రేపుతోంది. ఈ నెల 25 తేదీనే విచారణ చేపట్టాల్సివుండగా, న్యాయమూర్తి 26వ తేదీ బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం కూడా విచారణ చేపట్టారు. ఈ రోజు జాబితాలో లేదని, అందువల్ల రేపు విచారిస్తామని అవినాష్ తరపు న్యాయవాదులకు హైకోర్టు తెలిపింది. అదీకూడా గురువారం సాయంత్రం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని పేర్కొంది. దీంతో అవినాష్ బెయిల్ పిటిషన్‌పై సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. 
 
బుధవారం కోర్టు ప్రారంభంకాగానే అవినాష్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరపాలని ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే, బుధవారం విచారణ జరిపే కేసుల జాబితాలో లేదని అందువల్ల విచారణ చేపట్టలేమని న్యాయమూర్తి చెప్పారు. గురువారం విచారణ చేపట్టాలని న్యాయవాది కోరగా, అందుకు కోర్టు సమ్మతించింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కేసు విచారణ చేపడుతామని తెలిపింది. 
 
కాగా, అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్, ఆయనకు అనుకూలంగా జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెల్సిందే. హైకోర్టు ఆదేశాలను తీవ్రంగా తప్పుబట్టింది. ఈ నేపథ్యంలో హైకోర్టు విచారణపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.