శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 19 ఏప్రియల్ 2023 (22:41 IST)

సీఎం జగన్ - అవినాష్‌ల ప్రాణముప్పు.. దస్తగిరికి భద్రత ముప్పు

dasthagiri
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా దస్తగిరికి భద్రతను భారీగా పెంచారు. తనకు, తన కుటుంబానికి ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిల, వైకాపా నేతలు నుంచి ప్రాణహాని ఉందంటూ బుధవారం కడప జిల్లా ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు చేశారు. దీంతో రక్షణ కల్పించాలని ఆయన చెప్పారు. ఆయన వినతిపై జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించారు. 
 
దస్తగిరి 4 ప్లస్ 1 భద్రతను కల్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు పోలీసులు భద్రత విధుల్లో చేరారు. దస్తగిరి ఇంటి వద్ద 24 గంటలూ తుపాకులతో పహారా కాస్తారు. ఇప్పటికే దస్తగిరికి ఒక గన్‌మెన్ ఉన్నాడు. తాజాగా 4 ప్లస్ 1 సెక్యూరిటీ కల్పించడంతో దస్తగిరి భద్రత ఆరుకు పెరిగింది.