శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 సెప్టెంబరు 2021 (17:55 IST)

విశాఖలో గ్యాస్ లీకేజీ.. అసలేం జరిగింది..

విశాఖలో గ్యాస్ లీకేజీ ఘటన కలకలం రేపింది. విశాఖ హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్‌‌ (హెచ్‌పీసీఎల్‌)లో గ్యాస్ లీకయిందన్న వార్తలతో కార్మికులు జడుసుకున్నారు. దీంతో కార్మికులందరూ ఒక్కసారిగా మెయిన్ గేటుకు పరుగులు తీశారు. 
 
అధికారులకు సమాచారమిచ్చారు. సేఫ్టీ అధికారులు ఘటనాస్ధలికి చేరుకుని గ్యాస్ లీకేజీని అదుపు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ప్లాంట్‌కి ఎలాంటి ప్రమాదం లేదని సమాచారం.