హెచ్‌పీసీఎల్‌లో ఉద్యోగాలు.. 51 ఖాళీలు భర్తీ.. అక్టోబర్ 10 చివరి తేదీ

HPCL
HPCL
సెల్వి| Last Updated: బుధవారం, 30 సెప్టెంబరు 2020 (14:18 IST)
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) అనుబంధ సంస్థ అయిన హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయెల్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ మేనేజర్, డీజీఎం, ఎలక్ట్రికల్ ఇంజనీర్, షిఫ్ట్ ఇంఛార్జ్, ఫిట్టర్, ఫోర్‌మ్యాన్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 51 ఖాళీలను భర్తీ చేస్తోంది హెచ్‌పీసీఎల్ బయోఫ్యూయెల్స్ లిమిటెడ్.

మేనేజ్‌మెంట్‌లో 11 పోస్టులు, నాన్ మేనేజ్‌మెంట్‌లో 21 పోస్టులు, సీజనల్‌లో 19 పోస్టులున్నాయి. ఇవి ఏడాది కాల వ్యవధి ఉన్న పోస్టులే. ఈ పోస్టులకు దరఖాస్తు ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2020 అక్టోబర్ 10 చివరి తేదీ.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను హెచ్‌పీసీఎల్ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని, పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పంపాలి. దరఖాస్తుల్ని మెయిల్ ద్వారా కూడా పంపొచ్చు.దీనిపై మరింత చదవండి :