గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 సెప్టెంబరు 2020 (16:32 IST)

1557 క్లర్క్ పోస్టుల భర్తీ.. డెడ్‌లైన్ సెప్టెంబర్ 23.. లాస్ట్ డేట్ వరకు..?

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ (ఐబీపీఎస్) ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1557 క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు డెడ్‌లైన్ 2020 సెప్టెంబర్ 23న ముగుస్తుంది. మొత్తం 1557 పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఖాళీలున్నాయి. డిగ్రీ పాసైనవారెవరైనా ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.  
 
అభ్యర్థులు దరఖాస్తు చేసేముందు పాస్ ఫోటో, సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్ర స్కాన్ చేయాలి. వీటితో పాటు కావాల్సిన డాక్యుమెంట్స్, ఆన్‌లైన్ పేమెంట్ చేయడానికి కావాల్సిన వివరాలన్నీ సిద్ధం చేసుకోవాలి. యాక్టీవ్‌లో ఉన్న ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ తర్వాత అభ్యర్థులు ఐబీపీఎస్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో హోమ్ పేజీలోనే రిజిస్ట్రేషన్ చేసుకుని.. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‌వర్డ్ గుర్తుంచుకోవాలి. 
 
దరఖాస్తు ప్రక్రియ పూర్తైన తర్వాత అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసుకొని రిఫరెన్స్ కోసం భద్రపర్చుకోవాలి. దరఖాస్తు చేయడానికి సెప్టెంబర్ 23 వరకు అవకాశముంది. అయితే అభ్యర్థులు లాస్ట్ డేట్ వరకు వేచి చూడకుండా ముందే అప్లై చేస్తే సాంకేతిక సమస్యలు ఉండవు.