గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , బుధవారం, 8 సెప్టెంబరు 2021 (13:09 IST)

గొర్రెల‌ను వాగు దాటించి, ప్రాణాలు కాపాడిన ఎస్ఐ రమేష్

మ‌నుషుల‌కే కాదు, మూగ జీవాల‌కు కూడా పోలీసులే ర‌క్ష‌ణ అని నిరూపించారు...ఎస్.ఐ. ర‌మేష్. పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో కురిసిన కుండపోత వానతో వాగులు పొంగి పొరలడంతో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింది. వసంతవాడ గ్రామం నుండి రుద్రకోట వెళ్లే దారిలో పెద్ద వంతెన వద్ద ప్రమాదకర స్థాయిలో నీరు ప్రవహించడంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. 
 
పెద్ద వంతెన దాటలేక రెండు వేల గొర్రెలు కొట్టుకుపోతూ ఉండగా, ఆ సమాచారాన్ని తెలుసుకున్న వేలేరుపాడు పోలీస్ స్టేషన్ ఎస్.ఐ పరిమి రమేష్ హుటాహుటిన అక్క‌డికి చేరారు. త‌న సిబ్బందితో ఆ ప్రదేశానికి చేరుకుని, గ్రామస్థుల సహకారంతో వాగులో దిగి,  గొర్రెలు కొట్టుకుపోకుండా సురక్షిత ప్రాంతానికి  తరలించారు. ప్రజల రక్షణ ఏ కాకుండా జంతువుల ప్రాణాల పట్ల కూడా బాధ్యత కలిగి ఉండాల‌ని సిబ్బందికి సూచించారు. ప్ర‌మాదకర స్థలానికి వచ్చి, మూగ జీవాల ప్రాణాలు కాపాడిన వేలేరుపాడు ఎస్ ఐ పరిమి రమేష్ ను, ఇత‌ర పోలీసు సిబ్బందిని ప్రజలు, గొర్రెల యజమానులు కొనియాడారు. వారికి కృతజ్ఞతలు తెలియపరిచారు.