ప్రాణంతీసిన స్కూటీ స్టాండ్.. ఎలా?

deadbody
సెల్వి| Last Updated: శనివారం, 5 సెప్టెంబరు 2020 (14:51 IST)
స్కూటీ స్టాండ్ ఓ వ్యక్తి ప్రాణం తీసింది. స్కూటీ స్టాండ్ ప్రాణమెలా తీసిందనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన ఎక్కిడి దుర్గారావు(35) అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం పాలకొల్లు వైపు స్కూటీపై తన వ్యక్తిగత పనిమీద వెళ్లాడు. అయితే, ఆయన ఇంటి నుంచి బయలుదేరే సమయంలోనే స్కూటీ స్టాండ్ తీయలేదు. ఈ విషయం ఆయన మరిచిపోయాడు.

ఈ క్రమంలో పెన్నాడలోని రావిచెట్టు సెంటర్‌ సమీపంలోకి వచ్చే సరికి స్కూటర్‌కు ఉన్న స్టాండ్‌ తీయకపోవడంతో అది రోడ్డుకు తగిలి పడిపోయారు. గ్రామానికి చెందిన మహిళా పోలీసులు అరుణజ్యోతి, దుర్గాభవానీ 108కు సమాచారం అందించారు. ఆ సిబ్బంది వచ్చి పరిశీలించగా దుర్గారావు చనపోయాడని చెప్పారు. దుర్గారావుకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
దీనిపై మరింత చదవండి :