శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (22:09 IST)

పబ్జీ గేమ్‌కు బదులు ఫౌజీ గేమ్‌.. అనౌన్స్ చేసిన అక్షయ్ కుమార్

FAU-G
భారత్-చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ఇటీవలే 118 చైనీస్ యాప్స్‌పై నిషేధం విధించింది. ఇందులో పబ్జీ కూడా ఉన్నది. భారత్‌లో దాదాపుగా 20 కోట్ల మంది పబ్జీ గేమ్ యూజర్లు ఉన్నారు. పబ్జీ గేమ్‌పై నిషేధం విధించిన తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఫౌజీ గేమ్‌ను అనౌన్స్ చేశారు. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా ఫౌజీ గేమ్‌ను లాంచ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. 
 
అక్టోబర్ నెలలో ఈ గేమ్ రిలీజ్ కాబోతోంది. పూర్తి స్థాయి యాక్షన్‌తో సాగే ఈ గేమ్ ఆధ్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నట్టు అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మల్టీప్లేయర్ గేమ్‌కు సంబంధించిన పోస్టర్‌ను అక్షయ్ కుమార్ రిలీజ్ చేశారు. భారత సైనికుల త్యాగాల గురించి ఈ గేమ్ తెలియజేస్తుందని అక్షయ్ కుమార్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.
 
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్‌ భారత్‌కు మద్దతుగా ఫియర్‌లెస్‌ అండ్‌ యునైటెడ్‌ గార్డ్స్‌ (ఎఫ్ఎయూ-జీ)ను పరిచయం చేస్తున్నందుకు సగర్వంగా ఉంది. వినోదంతో పాటు ఆటగాళ్లు మన వీర సైనికుల త్యాగాల గురించి కూడా నేర్చుకుంటారు. గేమ్‌ ద్వారా వచ్చే నికర ఆదాయంలో 20శాతాన్ని భారత్‌కే వీర్‌ ట్రస్ట్‌కు విరాళంగా ఇవ్వబడుతుందని అక్షయ్‌ కుమార్‌ ట్వీట్‌ చేశాడు.